News Hunter : విద్యాబుద్ధులు నేర్పించాల్సిన టీచర్ స్టూడెంట్ కు ప్రేమ పాఠాలు చెప్పింది. దాంతో పెళ్ళైన నెల రోజులకే కట్టుకున్న భర్తకు షాక్ ఇచ్చింది. వివరాల్లోకివెళితే తమిళనాడు రాష్ట్రం సేలం జిల్లా తిరువాగౌండనూరుకు చెందిన 26 ఏళ్ల మహిళ.. ప్రైవేటు ట్యుటోరియల్‌లో టీచర్‌గా పనిచేస్తోంది. ఆమెకు బాగల్‌పట్టికి ప్రాంతానికి చెందిన వ్యక్తితో నెలరోజుల కిందటే వివాహం జరిగింది. అయితే ఆమె భర్త చెన్నైలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ పనిచేస్తుండటంతో అన్ని ఏర్పాటు చేసుకున్నాక భార్యను తీసుకెళ్లాలని అతనొక్కడే చెన్నై వెళ్ళిపోయాడు.
కానీ అప్పటికే పదవతరగతి విద్యార్థితో ప్రేమలో పడిన సదరు మహిళ విద్యార్థితో సహా ఇంటినుంచి పారిపోయింది. తల్లిదండ్రులు ఆమెకోసం ఎంత వెతికినా లాభం లేకపోవడంతో చివరకు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశారు. ఇదే క్రమంలో సదరు మహిళ అదే పోలీస్ స్టేషన్ కు విద్యార్థితో సహా వచ్చి.. మేమిద్దరం కలిసుంటాం మాకు పెళ్లి చెయ్యండి అని కోరింది. దాంతో ఆమె తండ్రి కంప్లైంట్ చేశాడని వారిని అదుపులోకి తీసుకోవాలో లేక వారిద్దరికీ పెళ్లి చెయ్యాలో అర్ధంకాక తలలు పట్టుకున్నారు. విద్యార్థి మైనర్ కావడం తో టీచర్‌కు, బాలుడికి కౌన్సెలింగ్ ఇచ్చి వారి వారి తల్లిదండ్రుల వెంట పంపించారు.