News Hunter: ఈసారి ఎన్నికల్లో తొలిసారిగా వివిపాట్ యంత్రాలను ఎన్నికల సంఘం వినియోగిస్తోంది. ఈ మిషన్ ద్వారా తమ ఓటు ఎవరికి వేశామన్నది ఓటరు చూసుకునే అవకాశం ఉంటుంది. గతంలో ఈవీఎంలలో ఓటు వేసినప్పుడు ట్యాంపరింగ్ జరిగిందని, ఒక అభ్యర్థి ఓటు మరొకరికి పడిందని.. ఇలా పలురకాల, అనుమానాలు, ఆరోపణలు వచ్చాయి. దీంతో ఎలక్ట్రానిక్ మిషన్లతోపాటు వివిపాట్ యంత్రాలను ఈసీ అందుబాటులోకి తెచ్చింది. ఓటు వేసిన ఏడు సెకన్లలో ఎవరికి ఓటు వేశామో అన్నది తెలిసిపోతుంది. ఓ పేపర్ స్లిప్ ఓటరుకు మాత్రమే కనిపిస్తుంది. దీంతో మనకున్న అనుమానాలను ఓటు నివృత్తి చేసుకునే అవకాశముంది.

0 Comments