ADS

header ads

కోర్టులోకి పులి...

News Hunter : గుజరాత్‌లోని సురేంద్రనగర్ జిల్లాలోని చోటిల్లాలో శుక్రవారం మధ్యాహ్నం  ఓ పులి కోర్టు హాలులోకి ప్రవేశించింది. దానిని చూసిన న్యాయమూర్తులు, లాయర్లు, సిబ్బంది అందరూ పరుగులు తీశారు.కోర్టులో సీరియస్‌గా వాదనలు జరుగుతుండడంతో అందరి దృష్టి అటువైపే ఉంది. దీంతో చిరుత పులి వచ్చిన విషయాన్ని ఎవరూ గమనించలేదు. అయితే, ఆ తర్వాత దానిని చూసి కొందరు అందరినీ హెచ్చరిస్తూ బయటకు పరుగులు తీశారు. అది చూసి న్యాయమూర్తులు, లాయర్లు, సిబ్బంది, పిటిషన్‌దారులు ఇలా అందరూ భయంతో పరుగులు తీశారు. అనంతరం దానిని చాకచక్యంగా లోపలే ఉంచి తలుపులు మూశారు. పులి బారి నుంచి అందరూ క్షేమంగా తప్పించుకున్నట్టు సురేంద్రనగర్ పోలీసులు తెలిపారు. కోర్టులో పులిని బంధించిన విషయాన్ని పోలీసులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. దానిని పట్టుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు.

Post a Comment

0 Comments