ADS

header ads

అగ్రిగోల్డ్ కి చెందిన హాయ్ లాండ్ వేలానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్

News Hunter : అగ్రిగోల్డ్ కేసులో హాయ్ లాండ్ వేలానికి ఉమ్మడి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. హాయ్‌లాండ్‌ కనీస ధరను 600 కోట్లుగా ఉన్నత న్యాయస్థానం ఖరారు చేసింది. హాయ్‌లాండ్‌ విలువ ఎంత ఉంటుందనే దానిపై ప్రభుత్వం, సీఐడీ, ఎస్‌బీఐలు ధరను న్యాయస్థానానికి సమర్పించాయి. సుమారు 800 కోట్లు ఉంటుందని కోర్టుకు తెలపడంతో.. కనీస ధరను 600 కోట్లుగా హైకోర్టు ఖరారు చేసింది. హాయ్ లాండ్ వేలానికి సీల్డ్ కవర్ లో బిడ్డర్స్ వివరాలను అందించాలని..వచ్చే ఏడాది ఫిబ్రవరి 8న కోర్టు హాల్‌లోనే ఓపెన్‌ ఆక్షన్‌ నిర్వహిస్తామని ప్రకటించింది. దీనిపై తదుపరి విచారణను హైకోర్టు వచ్చే శుక్రవారానికి వాయిదా వేసింది. అయితే..అగ్రిగోల్డ్ ఆస్తుల కొనుగోలుపై వెనక్కి తగ్గిన జీఎస్ఎల్ కు కోర్టు సమయం వృధా చేసినందుకు మూడు కోట్లు జరిమాన విధించింది.