News Hunter : అమర జీవి పొట్టి శ్రీరాములు 66 వ వర్ధంతి పురస్కరించుకుని నెల్లూరు నగంలో జనసెన పార్టీ జిల్లా నాయకులు పసుపులేటి సంతోష్ ఆధ్వర్యంలో నగరం లోని గాంధీ బొమ్మ సెంటర్ నుండి ఆత్మకూరు బస్ స్టాండ్ దగ్గర పొట్టి శ్రీరాములు విగ్రహం వరకు వందలాది మంది జనసేన కార్యకర్తలతో బారీ ర్యాలీ నిర్వహించారు.అనంతరం పొట్టి శ్రీరాములు విగ్రహనికి పూల మాలలు వేసి నివాలులు అర్పించారు. ఈ సందర్భగా పసుపులేటి సంతోష్ మాట్లాడుతూ ఉమ్మడి మద్రాసు నుండి తెలుగు ప్రజలకు ప్రత్యేక రాష్ట్రంకొరకు అమరజీవి పొట్టిశ్రీరాముల మహోన్నత ఆశయంతో 58 రోజుల పాటు ఆమరణ దీక్షచేసి ప్రాణ త్యాగం వలన ఆంధ్ర రాష్టం ఏర్పాటైందని తెలియజేశారు. ప్రజలు ఎన్నో ఉద్యమాలు చేసి ఆంధ్ర రాష్ట్రాన్ని సంపాదించుకుంటే కొంత మంది రాజకీయ పార్టీలు వారి స్వలాభాల కోసం రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేశారన్నారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని త్వరలో గుణ పాఠం చెపుతారన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు మనుక్రాంత్ రెడీ,కొట్టే వెంకటేశ్వర్లు,వొమ్మెన సతీష్,వినోద్ రెడ్డి, కృష్ణా రెడ్డి తదతర జనసెన కార్యకర్తలు పాల్గన్నారు.

0 Comments