News Hunter : రాష్ట్రాభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్నామని, ఎన్ని కష్టాలు వచ్చినా ఆర్థికంగా ముందుకెళ్లామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. రెండంకెల అభివృద్ధి సాధించామన్నారు. ప్రధాని మోదీ విభజన చట్టంలోని హామీలను నెరవేర్చలేదని మండిపడ్డారు. టీడీపీకి బీసీలు వెన్నెముకన్నారు. బీసీలకు అండగా ఉంటాం, ఆదుకునే బాధ్యత తమదేనని బాబు మరోసారి స్పష్టం చేశారు. చేతివృత్తులవారికి నాణ్యమైన పనిముట్లు ఇస్తామని, తయారుచేసిన వస్తువులకు మార్కెటింగ్ కల్పిస్తామని సీఎం హామీ ఇచ్చారు. అవసరమైతే విదేశాలకు ఎగుమతి చేస్తామని, చేతివృత్తులకు టెక్నాలజీ అనుసంధానం చేస్తామని తెలిపారు. కొత్తగా గోకులాలు తీసుకొచ్చామని, ఇంట్లో రెండు ఆవులు ఉంటే షెడ్ ఏర్పాటు చేస్తామన్నారు. షెడ్, పౌడర్ కోసం 50శాతం సబ్సిడీ ఇస్తామని చంద్రబాబు చెప్పారు.
''హంద్రినీవా నీళ్లు తీసుకొచ్చే బాధ్యత నాదే. దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాం. అన్న క్యాంటీన్ల ద్వారా రూ. 5కే భోజనం పెడుతున్నాం. దేశంలో అన్న క్యాంటీన్ లాంటి పథకం ఎక్కడా లేదు. చంద్రన్న బీమా పథకాన్ని ప్రవేశపెట్టాం. డప్పు కళాకారులకు పింఛను ఇచ్చాం. పేదలను అన్ని విషయాల్లో ఆదుకుంటాం. రూ.15 లక్షల కోట్ల ఎంవోయూలు కుదుర్చుకున్నాం'' అని చంద్రబాబు.

0 Comments