ADS

header ads

సినిమా చూడాలన్న.. షాపింగ్ చేయాలన్న ఇంకనుండి రైల్వే స్టేషన్ కి వెళ్లొచ్చు..!

News Hunter : ఇప్పటి వరకు సరదగా షాపింగ్‌ మాల్స్‌కు, మల్టీప్లెక్సులకు వెళ్లే వారు ఇక నుంచి రైల్వేస్టేషన్లకు కూడా వెళ్లే రోజులు త్వరలో రానున్నాయి. ది ఇండియన్‌ రైల్వే స్టేషన్స్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఐఆర్‌ఎస్‌డీసీ) దేశంలోని పలు ప్రైవేటు రంగ సంస్థలతో చర్చలు చేపట్టింది. వీటిల్లో బిగ్‌బజార్‌, పీవీఆర్‌ సినిమా వంటి దిగ్గజ సంస్థలు ఉన్నాయి. వీటిని రద్దీగా ఉండే రైల్వే స్టేషన్లలో ఏర్పాటు చేయాలని ఐఆర్‌ఎస్‌డీసీ నిర్ణయించింది. వీటిల్లో తొలి ప్రాజెక్టు గుజరాత్‌లోని గాంధీనగర్‌లో రైల్వేస్టేషన్‌లో చేపట్టారు. ఈ స్టేషన్‌ను ఇటీవలే రీమోడల్‌ చేశారు. ఇక్కడ ఆరుతెరలతో మల్టీప్లెక్స్‌తోపాటు అందమైన గార్డెన్‌, 300 గదుల హోటల్‌ను నిర్మించనున్నారు.
'' గాంధీనగర్‌ రైల్వే స్టేషన్‌ను ప్రపంచ స్థాయిలో తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టాము. దీనిలో భాగంగా బిగ్‌బజార్‌, పీవీఆర్‌ సంస్థలను అక్కడ శాఖలను ప్రారంభించాల్సిందిగా కోరాము. వారు కూడా అవకాశాలను పరిశీలిస్తున్నారు.'' అని ఐఆర్‌ఎస్‌డీసీ ఎండీ ఎస్‌.కె.లోహియా తెలిపారు. ఐఆర్‌ఎస్‌డీసీ దేశంలోని రైల్వేస్టేషన్లను ఆధునికీకరించే బాధ్యతను చేపట్టింది. రైల్వేస్టేషన్లలోని 'రిటైల్‌ స్పేస్‌'ను టెండర్ల ప్రక్రియలో ఆయాసంస్థలకు అప్పగించనున్నారు.

Post a Comment

0 Comments