News Hunter : ఏపీలో ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు పర్యటన ఖరారైంది. జనవరి 4 నుంచి 6వ తేదీ వరకు ఆయన పర్యటించనున్నారు. విశాఖ, కాకినాడ, విజయవాడలో పర్యటిస్తారు. జనవరి 4న సాయంత్రం ప్రత్యేక విమానంలో వెంకయ్య విశాఖ చేరుకుంటారు. 5న ఉదయం 9.50కి కాకినాడలోని రంగరాయ మెడికల్ కాలేజీ గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొని, విద్యార్ధులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అదే రోజు సాయంత్రం 4 గంటలకు లయోలా కాలేజీ శతవసంతాల వేడుకల్లో పాల్గొననున్నారు. 6న ఉదయం 9 గంటలకు గన్నవరం స్వర్ణభారతి ట్రస్ట్‌లో మెడికల్ క్యాంప్‌ను వెంకయ్యనాయుడు ప్రారంభిస్తారు.
