News Hunter : ఉదయం నుంచి ఉత్కంఠ, ఉద్రిక్త పరిణామాల మధ్య కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిని పోలీసులు విడుదల చేశారు.జడ్చర్ల పోలీస్ శిక్షణా కేంద్రం నుంచి రేవంత్‌ను కొడంగల్‌కు తరలించారు. ఈసీ రజత్ కుమార్ ఆదేశాలతో రేవంత్ రెడ్డిని పోలీసులు విడుదల చేశారు.రేవంత్ అరెస్ట్ తో ఉదయం నుంచి కొండగల్‌లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కేసీఆర్ పర్యటనను అడ్డుకుంటామని రేవంత్ హెచ్చరించారు. దీనిపై టీఆర్ ఎస్ నేతలు ఈసీకి ఫిర్యాదు చేయడంతో…రేవంత్ పై ఎలాంటి చర్యలు తీసుకున్నారో నివేదిక ఇవ్వాలని డీజీపీ మహేందర్ రెడ్డిని ఆదేశించారు సీఈవో రజత్ కుమార్. ఈ క్రమంలో తెల్లవారు జామున కొడంగల్ లోని రేవంత్ ఇంటికి వెళ్లిన పోలీసులు అతన్ని బలవంతంగా అరెస్ట్ చేసి జడ్చర్ల తరలించారు. దీంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఉదయం నుంచి కొడంగల్ లో హైడ్రామా చోటు చేసుకుంది.
మరోవైపు రేవంత్ రెడ్డి అరెస్ట్ పై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏ ఆధారాలతో అరెస్ట్ చేశారని పోలీసులను ప్రశ్నించిన న్యాయ స్థానం…అరెస్ట్ పై వెంటనే నివేదిక సమర్పించాలని ఆదేశించింది. శాంతి భద్రత సమస్యలు తలెత్తుతాయన్న సమాచారం మేరకే ముందస్తు చర్యల్లో భాగంగా రేవంత్ను అరెస్ట్ చేశామని కోర్టుకు తెలిపారు పోలీసులు.

0 Comments