ADS

header ads

మీకు నిదుర పట్టడం లేదా.. అయితే ఆ ఊరికి వెళ్ళండి..?

News Hunter : కొంత మందికి బస్సెక్కితే చాలు నిద్ర ముంచుకొచ్చేస్తుంది. సార్.. మీ స్టాప్ వచ్చింది అని కండక్టర్ అరిచేంత వరకు లేవరు. హాయిగా ఓ స్లీప్ వేసేస్తారు. అయ్యో అప్పుడే వచ్చేసిందా అంటూ హడావిడిగా బస్ దిగేస్తుంటారు. సరే.. బస్సంటే కదులుతూ ఉంటుంది. చల్లగాలి మేనుకి తగులుతూ ఉంటే కునుకు పట్టేస్తుంది.
మరి ఇక్కడేంటి ఊర్లోకి అడుగుపెడితేనే నిద్ర ముంచుకొచ్చేస్తుందట. ఇంతకీ ఎక్కడ ఉందో చెప్పండి అసలే నిద్ర పట్టక ఛస్తున్నాం. రోజూ స్లీపింగ్ టాబ్లెట్లు వేసుకోలేకపోతున్నాం అంటారా.. సరే పదండి అదరం కలిసి ఓ స్లీప్ వేసి వద్దాం.. కజకిస్థాన్‌లోని కలాచీ గ్రామం. ఈ ఊరిలోకి అడుగుపెడితే చాలు నిద్ర ముంచుకొస్తుంది.
శరీరం నియంత్రణ కోల్పోతుంది. కొన్ని క్షణాలు ఏం జరుగుతుందో తెలియదు. అకస్మాత్తుగా నిద్ర పట్టేస్తుంది. ఆ మత్తులో ఎప్పుడు పడుకుందీ.. ఎక్కడ పడుకుందీ కూడా తెలియదు. కొంతమంది డ్రైవింగ్ చేస్తూ కూడా నిద్ర పోతారట. వాళ్లు అలా నిద్ర ఎందుకు పోతున్నారో కనుక్కుందామని శాస్త్రవేత్తలు కూడా వెళ్లి ఆ రహస్యాన్ని కనిపెట్టలేకపోయారట.

ఇలా నిద్రపోయే సమస్యను స్లీపింగ్ డిజార్డర్ అంటారు. దీని వల్ల ఆ ఊరి ప్రజలు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కుంటున్నారట. కొంతమంది పనులు చేస్తూ నిద్రలోకి జారుకుంటే, మరి కొందరు నడుస్తూ కూడా నిద్ర పోతున్నారు. ఇంకొంతమంది నిద్రని ఆపుకోలేక రోడ్లపైనే ఎక్కడ పడితే అక్కడ పడుకుని నిద్రపోతుంటారు.
లేచిన తరువాత ఏవో పిచ్చి మాటలు మాట్లాడుతుంటారు. కొంతమందికైతే రెండ్రోజుల వరకుమెలకువ రాదట. ఇంతకీ ఆ ఊరి ప్రజలు ఇంతగా నిద్ర పోవడానికి గల కారణాలను విశ్లేషించారు మరో శాస్త్రజ్ఞుల బృందం.. తేలిందేమంటే అక్కడ ఉన్న యురేనియం నిక్షేపాలే వారిని నిద్రపుచ్చుతున్నాయని తెలుసుకున్నారు.

యురేనియం నుంచి విడుదలయ్యే గ్యాస్ ఊరి ప్రజలపై దుష్ప్రభావం చూపుతోంది. ఆ గ్యాస్ పీల్చడం వల్ల అకస్మాత్తుగా కళ్లు మూతపడి స్పృహ కోల్పోతున్నట్లు చెబుతున్నారు. ఈ సమస్య వల్లే చాలా మంది ఊరి ప్రజలు గ్రామం విడిచి వెళ్లి పోతున్నారు. కొంతమంది మాత్రం ఆ ఊరిలోనే ఉంటూ నిద్ర పోతూ, మెలకువ వచ్చినప్పుడు పనులు చేసుకుంటూ జీవితాన్ని గడిపేస్తున్నారు.