News Hunter : నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఆర్థికంగా వెనుకబడిన అగ్రకులాలకు పది శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. 10 శాతం రిజర్వేషన్ల పెంపుకు కేంద్ర కేబినెట్ సోమవారం నాడు ఆమోదం తెలిపింది.విద్య, ఉద్యోగాలలో ఆర్థికంగా వెనుకబడిన కులాలకు పది శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని భావిస్తోంది. ఇందుకోసం కేంద్రం రాజ్యాంగ సవరణ చేయనుంది. ఈ నేపథ్యంలో రిజర్వేషన్లను 50 శాతం నుంచి 60 శాతానికి పెంచుతూ కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.ఏడాదికి రూ.5 లక్షల ఆదాయం కంటే తక్కువ ఉన్న వారు దీనికి అర్హులు. అలాగే, ఐదు ఎకరాల కంటే తక్కువ పొలం ఉన్న వారు రిజర్వేషన్లకు అర్హులు
