ADS

header ads

కారు ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు

News Hunter : విజయనగరం జిల్లా లోని దత్తిరాజేరు మండలం బుర్జివలస పోలీస్‌ స్టేషన్‌ సమీపంలో సోమవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. గుర్తు తెలియని కారు ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. దత్తిరాజేరు మండలం మరడాం గ్రామంలో ఫైనాన్స్‌ వ్యాపారం చేస్తున్న శ్రీనివాసరావు (48) ఈ రోజు ఉదయం రామభద్రాపురం నుండి మరడాం వైపు బైక్‌పు వెళుతుండగా.. వెనుక నుండి వస్తున్న కారు శ్రీనివాసరావును ఢీకొంది. గమనించిన స్థానికులు వెంటనే గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు.