ADS

header ads

సోమిరెడ్డి ఎన్నికల ప్రచారంలో బ్రహ్మరథం పట్టిన ప్రజలు..


NEWS HUNTER : సర్వేపల్లి టీడీపీ అభ్యర్థి, రాష్ట్ర మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, తిరుపతి ఎంపీ అభ్యర్థి పనబాక లక్ష్మి ఎన్నికల ప్రచారం ఈరోజు ముత్తుకూరు మండలం పంటపాళెం, ఈపూరు, దొరువులపాళెం, దువ్వూరువారిపాళెం, నారికేళపల్లి, డమ్మాయపాళెం, వల్లూరులో జరిగింది.

సర్వేపల్లి ప్రగతి రథసారధకుడు సోమిరెడ్డికి, పనిచేసే లక్ష్మిగా గుర్తింపు పొందిన పనబాక లక్ష్మికి అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పట్టారు.

2 వేల కోట్లకు పైగా నిధులతో అభివృద్ధి, సంక్షేమ పథకాలు చేపట్టి సర్వేపల్లి నియోజకవర్గ ముఖచిత్రాన్ని మార్చిన సోమిరెడ్డికి, గతంలో కేంద్రమంత్రిగా అభివృద్ధిని పరుగులెత్తించిన పనబాకకు అండగా ఉంటామంటున్న ప్రజానీకం..