ADS

header ads

నెల్లూరు జిల్లాలో ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం - ఎస్పి ఐశ్వర్య రస్తోగి.

NEWS HUNTER : నెల్లూరు జిల్లాలో పది అసెంబ్లీ స్థానాలకు రెండు పార్లమెంటు స్థానాలకు ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు పటిష్టమైన ప్రణాళికలను రూపొందించినట్లు ఎస్పీ తెలిపారు.దాదాపు నాలుగు వేల మంది పైగా పోలీస్ ఫోర్స్ ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.జిల్లాలు మొత్తం 16 సరిహద్దు చెక్ పోస్టులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వీటిలో 15 అంతర్జిల్లా  చెక్ పోస్టులు కాగా 1 అంతర్రాష్ట్ర చెక్ పోస్ట్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.జిల్లాలో మొత్తం 54 ఫ్లయింగ్ స్క్వాడ్లను నియమించినట్లు తెలిపారు. జిల్లాలో మొత్తం 1767 పోలింగ్ లొకేషన్లు ఉండగా వాటిలో లో 533 క్రిటికల్ పోలింగ్ లొకేషన్ గుర్తించినట్లు తెలిపారు. జిల్లాలో 642 లైసెన్స్ కలిగిన ఆయుధాలు ఉండగా వాటిలో  బ్యాంకులు మరియు ప్రైవేటు సంస్థలలో లో పని చేసే వారి వద్ద మినహాయించి మిగిలిన అన్ని ఆయుధాలను డిపాజిట్ చేయడం జరిగిందన్నారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘనకు సంబంధించిన ఫిర్యాదులు మరి ఏ ఇతర ఫిర్యాదులు కానీ కేంద్ర ఎన్నికల సంఘం ప్రవేశపెట్టిన సీ-విజిల్ యాప్ లో నమోదు చేసుకోవచ్చునని. నమోదు అయిన 100 నిమిషాలలో సంబంధిత అధికారి చర్య తీసుకోవలసి ఉంటుంది .ఎన్నికలకు సంబంధించి ఏదైనా సమాచారం లేదా ఫిర్యాదు కొరకు జిల్లా పోలీస్ కంట్రోల్ రూమ్ 100 గాని మరియు 0861-1950 గాని ఫోన్ చేసి సమాచారం తెలుసుకోవచ్చునని. ఎన్నికలకు సంబంధించి ఏదైనా రహస్య సమాచారం చెప్పాలనుకుంటే 9440796386 కు గాని లేదా వాట్సప్ నెంబర్ 9390777727 కు మెసేజ్ ద్వారా సమాచారం ఇవ్వవచ్చని జిల్లా ఎస్పీ ఐశ్వర్య రస్తోగి తెలిపారు.