NEWSHUNTER : తెదేపాకు మహేష్ ఫ్యాన్స్ మద్దతివ్వడం పార్టీకి ఆదనపు బలమని మంత్రి నారాయణ పేర్కొన్నారు. గురువారం నెల్లూరులోని ఓ కల్యాణ మండపంలో ఘట్టమనేని అభిమానులతో ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ యువత వల్లే ఏ దేశమైనా అభివృద్ధి చెందుతుందన్నారు. ఇంత మంది యువత తమ భవిష్యత్తు కోసం తిరిగి తెదేపా ప్రభుత్వం వచ్చేలా కృషి చేయాలన్నారు. తెదేపాకు మద్దతు ఇచ్చినందుకు ఘట్టమనేని ఫ్యాన్స్‌కి కృతజ్ఞతలు తెలిపారు. తెదేపా స్క్రీనింగ్ కమిటీ సభ్యుడు ఘట్టమనేని ఆదిశేషగిరి రావు మాట్లాడుతూ మహేష్ ఫ్యాన్స్ తెదేపానే బలపరచాలని నగరంలో నారాయణ, గ్రామీణంలో అజీజ్, ఎంపీగా బీద మస్తాన్‌రావు గెలుపునకు కృషి చేయాలని కోరారు.
