NEWS HUNTER : వీరందరూ సినిమా టిక్కెట్ల కోసం గుమిగూడిన జనం అనుకుంటే పొరబడినట్లే. ప్రభుత్వం స్వయంశక్తి సంఘాల మహిళలకు అందజేసిన పసుపు- కుంకుమ నిధులు బ్యాంకు ఖాతాల్లో జమ కావడంతో వీరందరూ సారవకోట గ్రామీణ వికాస బ్యాంకుకు గురువారం తరలివచ్చారు. ఒకే సారి పెద్దసంఖ్యలో మహిళలు బ్యాంకుకు చేరుకోవడంతో కిక్కిరిసిపోయింది. అందరికీ నగదు అందడంతో సర్వత్రా ఆనందం వ్యక్తమైంది. సారవకోట మండలంలో 1,195 స్వయంశక్తి సంఘాలుండగా, 11,900 మందికి పసుపు-కుంకుమ మొత్తాలు జమయయ్యాయి. గత నెలలో రూ.2,500 అందుకున్న మహిళలందరూ ప్రస్తుతం రూ.3,500 నగదు అందుకుంటున్నారు.
