NEWS HUNTER : జనసేన అధినేత పవన్ కల్యాణ్.. సీఎం చంద్రబాబుకు రహస్య మిత్రుడంటూ. అంతర్గతంగా ఆయనకు మద్దతు ఇస్తున్నారంటూ వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలపై ఘాటుగా స్పందించారు జనసేనాని... ఇవాళ మదనపల్లిలో ఎన్నికల ప్రచారసభలో ఈ విషయంపై మాట్లాడుతూ.. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తున్నా నేను టీడీపీకి మద్దతు ఇచ్చే వాడిని అయితే మగాడిలాగా ఇస్తా.. 2014లో అలానే ఇచ్చానంటూ ఘాటు వ్యాఖ్యలతో సమాధానం ఇచ్చారు. మీలా భయపడి దొడ్డి దారిలో బీజేపీ, టీఆర్ఎస్ మద్దతు కోసం చూడలేదని మండిపడ్డ పవన్.. ఈ ఎన్నిల్లో బీఎస్పీ, వామపక్షాలతో కలిసి పోటీ చేస్తున్నాం.. మిగతా ఏ పార్టీతో జనసేన పార్టీకి పొత్తు లేదని మరోసారి స్పష్టం చేశారు.
