NEWS HUNTER : ఆర్థిక సంవత్సరం చివరి రోజైన ఆదివారం (మార్చి 31న) ప్రభుత్వ కార్యకలాపాలు నిర్వహించే శాఖలను తెరిచే ఉంచాలని దేశపు పెద్ద బ్యాంక్ ఆర్బీఐ ఆదేశించింది. ప్రభుత్వంతో జరిపే అన్ని ఆర్థిక లావాదేవీలు నిరాటంకంగా సాగటానికి గాను బ్యాంకులు తమ శాఖలను తెరిచి ఉంచాలని సూచించింది. ఈ నెల 31న అన్ని ప్రభుత్వ ఆదాయ, చెల్లింపులకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలన్న కేంద్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా భారతీయ రిజర్వు బ్యాంక్ తాజాగా ఈ సర్క్యూలర్‌ను జారీచేసింది. 2018-19 ఆర్థిక సంవత్సరానికి ఏజెన్సీ బ్యాంకులు నిర్వహించే ప్రభుత్వ లావాదేవీలన్నీ ఇదే ఆర్థిక సంవత్సర ఖాతాల్లో ప్రతిబింబించేలా ఉండాలని పేర్కొంది.
దీని ప్రకారం ఈ నెల 30న (శనివారం) రాత్రి 8 గంటల వరకు, 31న (ఆదివారం) సాయంత్రం 6 గంటల వరకు ప్రభుత్వ రంగ బ్యాంకులు పనిచేయనున్నాయి. దీనికి తోడు ఆర్‌టీజీఎస్, నెఫ్ట్ ద్వారా ఆర్థిక లావాదేవీలను జరుపుకునే అవకాశాన్ని కూడా పొగడించాలిని ఆర్బీఐ బ్యాంక్‌లను కోరింది.