NEWS HUNTER : టీవీ వీక్షకులకు శుభవార్త. మీకు త్వరలోనే పోర్టబిలిటీ సౌకర్యం అందుబాటులోకి రానుంది. సెట్ టాప్ బాక్స్ (ఎస్‌టీబీ) మార్చే పని లేకుండానే డీటీహెచ్, కేబుల్ ఆపరేటర్లను మార్చే వెసులుబాటు కల్పించేందుకు ట్రాయ్ ప్రయత్నిస్తోంది. ట్రాయ్ చైర్మన్ ఆర్ఎస్ శర్మ ఈ మేరకు యూజర్లకు శుభవార్తను అందించారు. ఈ ఏడాది చివరి నుంచి సెట్ టాప్ బాక్స్ మార్చుకోవాల్సిన అవసరం లేదని ఆయన చెబుతున్నారు.
సెట్ టాప్ బాక్స్ (ఎస్‌టీబీ) మార్చుకోకుండానే డీటీహెచ్, కేబుల్ ఆపరేటర్లను మార్చే వెసులుబాటు త్వరలో తీసుకు రానున్నట్లు తెలిపారు. ఈ ఏడాది చివరి నాటికి ఈ సౌకర్యం యూజర్లకు అందుబాటులోకి రావొచ్చు.
గత రెండేళ్లుగా సెట్ టాప్ బాక్స్‌ల ఇంటర్ ఆపరబిలిటీపై పనిచేస్తున్నామని ట్రాయ్ చైర్మన్ ఆర్.ఎస్.శర్మ తెలిపారు. చాలా సమస్యలను పరిష్కరించామన్నారు. ఇంకా కొన్ని వ్యాపారపరమైన సవాళ్లు మిగిలి ఉన్నాయని పేర్కొన్నారు.
దీనిని అమలు అడ్డంకిగా ఉన్న పెద్ద పెద్ద సమస్యలు తీరిపోయాయని చెప్పారు. వీటిపై దృష్టి సారించామని, ఈ ఏడాది చివరి నాటికి ఈ సమస్యకు కూడా ముగింపు పలుకుతామన్నారు. ఈ వ్యాపార సవాళ్లు కూడా పరిష్కారమైతే ఈ ఏడాది చివరి నాటికి పోర్టబులిటీ అందుబాటులోకి వస్తుందన్నారు.