NEWS HUNTER : విశాఖలో బుధవారం బీఎస్పీ అధినేత్రి మాయావతి, జనసేనాని పవన్ మీడియా సమావేశం నిర్వహించనున్నారు. ఇవాళ సాయంత్రం విజయవాడలోని అజిత్‌సింగ్‌నగర్ ఎంబీపీ స్టేడియంలో జరుగనున్న బహిరంగ సభలో మాయావతి, పవన్ పాల్గొంటున్నారు. స్టేడియంలో జరుగుతున్న ఏర్పాట్లను జనసేన, బీఎస్పీ, సీపీఎం, సీపీఐ కూటమిగా పోటీ చేస్తున్నందున ఈ సభకు జనసేన అధినేత పవన్‌కళ్యాణ్, సీపీఎం, సీపీఐ రాష్ట్ర నాయకులు హాజరవుతున్నారు. రేపు మధ్యాహ్నం 3 గంటలకు తిరుపతిలో మాయావతి, పవన్ ప్రచారం నిర్వహిస్తారు. మాయావతి మంగళవారం విశాఖ చేరుకున్నారు. సాయంత్రం ఐదు గంటలకు ప్రత్యేక విమానంలో వచ్చిన ఆమెకు విమానాశ్రయంలో పవన్‌కల్యాణ్, మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. అనంతరం ఆమె నగరంలోని నోవాటెల్ హోటల్‌కు చేరుకుని బస చేశారు. పొత్తులో భాగంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో జనసేన, వామపక్షాల తరుపున ఆమె ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు.
