ADS

header ads

చరణ్ కి గాయం.. షూటింగ్ వాయిదా

NEWS HUNTER : ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో భారీ మల్టీస్టారర్‌ 'ఆర్‌ ఆర్‌ ఆర్‌' రూపొందుతుంది. ఇప్పటికే రెండు షెడ్యూల్స్‌ని పూర్తి చేసుకుంది. గుజరాత్‌ షెడ్యూల్‌లో పాల్గొనేందుకు ఇటీవలే చిత్ర బృందం అక్కడికి చేరుకుంది. తాజాగా హీరో రామ్‌ చరణ్‌ గాయపడ్డారు. మంగళవారం ఆయన జిమ్‌లో బాడీ వర్కౌట్‌ చేస్తున్న క్రమంలో కాలు బెణికి గాయమైంది. మూడు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారట. దీంతో పుణెలో జరగాల్సిన ఈ చిత్ర షూటింగ్‌ వాయిదా వేసినట్టు చిత్ర బృందం బుధవారం ట్విట్టర్‌ ద్వారా వెల్లడించింది. ఇటీవల గుజరాత్‌లోని వడోదరలో చిత్రీకరణ జరిపారు. తారక్‌, చరణ్‌ స్కూటీపై అక్కడ చక్కర్లు కొట్టిన వీడియో ఒకటి ఇటీవల సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

తదుపరి షెడ్యూల్‌ పుణెలో జరగాల్సి ఉంది. ఇప్పుడది వాయిదా పడింది. ఇక అత్యంత ప్రతిష్టాత్మకంగా సుమారు రూ.300కోట్ల నుంచి రూ.400కోట్ల భారీ బడ్జెట్‌తో డి.వి.వి దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్‌, కొమురం భీమ్‌గా ఎన్టీఆర్‌ నటిస్తున్నారు. చరణ్‌ సరసన అలియా భట్‌, ఎన్టీఆర్‌ సరసన డైసీ ఎడ్గార్‌ జోన్స్‌ నటిస్తుండగా, అజరు దేవగన్‌, సముద్రఖని కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది జులై 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.