NEWS HUNTER : దేనా, విజయాబ్యాంకులు సోమవారం బ్యాంక్ ఆఫ్ బరోడాలో విలీనమయ్యాయి. ఈ విలీనంతో దేశంలోనే రెండో అతి పెద్ద ప్రభుత్వ బ్యాంకుగా బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ) అవతరించింది. కాగా, ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ తర్వాత మూడో అతి పెద్ద బ్యాంకు. ఈ మూడు బ్యాంకుల వ్యాపారం ఏకీకృత ప్రాతిపదికన సుమారు రూ.15లక్షల కోట్లుగా ఉంది. ఇందులో 8.75లక్షల కోట్లు డిపాజిట్లు ఉండగా, అడ్వాన్సుల రూపంలో రూ.6.25లక్షలు కోట్లు ఉన్నాయి. ఈ విలీనంతో బ్యాంకు ఆఫ్ బరోడా పరిధిలోకి 9500 బ్రాంచ్‌లు, 13,400ఏటీఎంలు, 85,000 ఉద్యోగులు, 12కోట్ల మంది వినియోగదారులు వచ్చి చేరారు.
విలీన ప్రక్రియలో భాగంగా ప్రతి 1000 విజయాబ్యాంక్ షేర్లకు 402 బీవోబీ షేర్లు లభిస్తాయి. అదే సమయంలో ప్రతి 1000 దేనా బ్యాంక్ షేర్లకు 110 బీవోబీ షేర్లు లభిస్తాయి. విలీన ప్రాతిపదిక ప్రకారం ఆయా బ్యాంకులకు షేర్లను కేటాయించినట్లు బ్యాంకు ఆఫ్ బరోడా వెల్లడించింది. ప్రభుత్వం గత సెప్టెంబర్‌లో ఈ బ్యాంకుల విలీనం అంశాన్ని వెల్లడించింది. బ్యాంకింగ్ సంస్కరణల్లో భాగంగా ఇప్పటికే ఐడీబీఐ బ్యాంక్‌లో 51శాతం వాటాను ఎల్‌ఐసీ కొనుగోలు చేసింది. దీంతోపాటు ఇప్పటికే పీఎస్‌బీల్లో ప్రభుత్వం రూ.1.06లక్షల కోట్ల మేరకు మూలధనాన్ని సమకూర్చింది.