ADS

header ads

మూడో విడత పసుపు కుంకుమకు ఈసీ ఓకే

NEWS HUNTER : పసుపు-కుంకుమ పథకం పేరుతో డ్వాక్రా మహిళలకు రూ.10 వేల సాయం ఆర్ధిక సాయం అందిస్తున్న ఏపీ సర్కార్ ...ఇప్పటికే మొదటి విడతగా రూ.2500, రెండో విడతగా రూ.3500 ప్రభుత్వం అందించింది. అయితే మూడో విడతగా రూ.4 వేలు అందించాల్సి ఉండగా పథకం నిలిపివేత కోరుతూ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు విపక్షాలు ఫిర్యాదు చేశాయి. ఈ ఫిర్యాదు పరిశీలించిన ఈసీ ఇప్పటికే లబ్దిదారుల ఎంపిక పూర్తయినందున పథకం అమలుకు ఇబ్బంది లేదని...దీనికి ఎన్నికల కోడ్ అడ్డు రాదని స్పష్టం చేసింది. పసుపు-కుంకుమ నగదు విడుదలకు కేంద్ర ఎన్నికల కమిషన్ గ్రీన్ సిగ్నల్ ఊరట చెందిన తెలుగుదేశం ప్రభుత్వం పసుపు-కుంకుమ పథకం కింద మూడో విడత కింద రూ.3900 కోట్లు విడుదల చేసింది.