ADS

header ads

ఏపీ ఓటర్లకు రైల్వేశాఖ గుడ్‌న్యూస్

NEWS HUNTER : ఏపీలో గురువారమే ఎన్నికల పోలింగ్ జరగనుంది. అయితే ట్రైన్లు, బస్సులన్నీ ఫుల్‌గా నిండిపోయాయి. దీంతో చేసేది లేక జనరల్ బోగీల్లో వెళ్లిపోతున్నారు. అవి కూడా ఖాళీగా లేకపోవడంతో కొంతమంది నిరాశలో పడ్డారు. ఇలాంటి సమయంలో రైల్వేశాఖ.. ఏపీ ఓటర్లకు గుడ్‌న్యూస్ చెప్పింది. ఎన్నికల దృష్ట్యా సికింద్రాబాద్‌ నుంచి ఏపీకి ప్రత్యేక రైళ్లు వేసినట్లు ప్రకటించింది. బుధవారం(ఈరోజు) సాయంత్రం 6.20కి సికింద్రాబాద్‌ నుంచి కాకినాడకు ప్రత్యేక రైలు వేసినట్లు తెలిపింది. అలాగే రాత్రి.7.20కి సికింద్రాబాద్‌ నుంచి తిరుపతికి ప్రత్యేక ట్రైన్‌ను వేశారు. ఇక రాత్రి 9గంటలకు లింగంపల్లి నుంచి కాకినాడకు ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు వెల్లడించింది.