ADS

header ads

జిల్లా వడ్డెర సంక్షేమ సంఘం నేతలు వైసీపీలో చేరిక..

NEWS HUNTER : నెల్లూరు జిల్లాలోని వడ్డెర సంక్షేమ సంఘం నేతలు గురువారం వైసీపీలో చేరారు  నెల్లూరు లోక్సభ వైసీపీ అభ్యర్థి మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్రెడ్డి వారిని పార్టీలోకి  కండువాలు కప్పి స్వాగతించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వడ్డెర సంఘం ముఖ్య నేతలు వైసీపీలో చేరడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు సభ్యులంతా కలిసి జిల్లాలో మద్దతు ఇవ్వడం ఆనందదాయకమని తెలిపారు వారిని మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నామని వారికి అన్ని విధాలా సహాయ సహకారాలు అందించి గౌరవప్రదంగా చూసుకుంటామని హామీనిచ్చారు..ఆ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు మల్లి శ్రీనివాసులు ఇతర నేతలు మహేష్ సురేష్ బాలకృష్ణ వరలక్ష్మీ చల్లా జయ మస్తానయ్య చల్లా చంద్రమౌళి మల్లి సీనయ్య తదితరులు పార్టీలో చేరిన వారిలో ఉన్నారు.


జగన్ను సిఎం చేస్తాం

వైసీపీ అధినేత జగన్మోహన్రెడ్డికి తమ ఓట్లు అన్నీ వేసి సీఎం చేస్తామని జిల్లా వడ్డెర సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు మల్లి శ్రీనివాసులు స్పష్టం చేశారు తమ సంఘం నేతల ఆదేశం మేరకు జిల్లాలోని 10 నియోజకవర్గాలు రెండు లోక్సభ నియోజకవర్గాల్లో ఉన్న అభ్యర్థులకు మద్దతునిస్తామని చెప్పారు తమ కులాన్ని ఎస్టీ జాబితాలో చేరుస్తామని గతంలో చంద్రబాబు చెప్పినప్పటికీ తన హామీని నిలబెట్టుకోలేదని అందుకే జగన్ కు తమ మద్దతు తెలుపుతున్నామని ప్రకటించారు పాదయాత్ర సందర్భంగా జగన్ను కలిసి తమ కోరికను వెల్లడించగా అందుకు ఆయన అంగీకరించారని స్పష్టం చేశారు ..