NEWS HUNTER : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికల ప్రచారానికి మంగళవారం విరామం ప్రకటించారు. ఎన్నికల వ్యూహంపై ఆయన మంగళవారం పార్టీ నాయకులతో సమావేశమై చర్చిస్తారు. బుధవారం తిరిగి ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొంటారు. 3వ తేదీన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మూడు జిల్లాల్లో ఎన్నికల ప్రచారం చేస్తారు.
బుధవారం ఉదయం 9.30 గంటలకు గుంటూరు జిల్లా సత్తెనపల్లి, 11.30 గంటలకు గురజాల, మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రకాశం జిల్లా ఒంగోలు, మధ్యాహ్నం 3.30 గంటలకు కృష్ణా జిల్లాలోని మైలవరంలో జరిగే ఎన్నికల ప్రచార సభల్లో జగన్ ప్రసంగిస్తారని పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.