NEWS HUNTER : మనస్తాపంతో యువకుడు మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని కడివెళ్ల గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన శ్రీనివాసులుకు ఇద్దరు కుమారులు. చిన్న కుమారుడు గాంధీ(19) తనకు పెళ్లికాలేదని మనస్తాపానికి గురయ్యాడు. గ్రామంలో తన వయస్సులో ఉన్న వారందరికీ పెళ్లిళ్లు జరిగాయని, తనకు మాత్రం ఇంకా పెళ్లికాలేదన్న మనస్తాపంతో రోజూ తల్లిదండ్రులతో బాధ పడేవాడు. తల్లిదండ్రులు బతుకుదెరువు కోసం రైల్వేకోడూరుకు వెళ్లారు. యువకుడు కూడా అక్కడి నుంచి రెండు రోజుల క్రితమే సొంతూరికి వచ్చాడు. అక్కడికి వస్తానని గురువారం రాత్రి కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడారు. శుక్రవారం అయితే ఉదయం ఇంట్లో ఉరి వేసుకుని ఉన్నాడు. ఈ విషయాన్ని గమనించిన చుట్టుపక్కల వారు కుటుంబ సభ్యులకు సమాచారం అందజేశారు. దీంతో కుటుంబ సభ్యులు గాంధీ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. రూరల్ పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు.
