ADS

header ads

మ్యాచులో మెడకు బంతి తగిలి క్రికెటర్ మృతి..


NEWS HUNTER : మ్యాచు ఆడుతుండగా బౌలర్ వేసిన బంతి తగిలి ఓ క్రికెటర్ మరణించాడు. ఈ ఘటనజమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని అనంత్‌నాగ్ పట్టణంలో చోటు చేసుకుంది. జమ్మూకాశ్మీర్ యువజన సర్వీసులు, క్రీడల శాఖ అనంత్ నాగ్ పట్ణణంలో బారాముల్లా, బుద్గాం జిల్లా జట్ట మధ్య క్రికెట్ మ్యాచ్ నిర్వహించింది.
క్రికెట్ పోటీల్లో పాల్గొన్న 18 ఏళ్ల క్రికెటర్ జహంగీర్ అహ్మద్ బ్యాటింగ్ చేస్తుండగా బౌలర్ బౌన్సర్ వేశాడు. బంతి అతని మెడపై కీలకమైన ప్రదేశంలో తగిలింది. దాంతో అతను అక్కడికక్కడే పడిపోయాడు. జహంగీర్ ను వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే అతను మరణించాడని వైద్యులు ప్రకటించారు.
విషయం తెలిసిన వెంటనే జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర గవర్నర్ సత్యపాల్ మాలక్ స్పందించి జహంగీర్ కుటుంబానికి రూ.5లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు.