NEWS HUNTER : లంగర్ హౌస్‌లో కలకలం సృష్టించిన చిన్నారి కిడ్నాప్ ఉదంతం సుఖాంతమైంది. పోలీసులు 12 గంటల్లో కిడ్నాప్ కేసును ఛేదించి చిన్నారిని క్షేమంగా తల్లిదండ్రుల చెంతకు చేర్చారు పోలీసులు. చిన్నారిని కిడ్నాప్ చేసిన నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. ఐదేళ్ల పాప వైష్ణవి ప్రస్తుతం ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. కిడ్నాపర్స్ వైష్ణవి చేతులు వెనక్కి మడిచి చిత్ర హింసలు పెట్టడంతో పాప రెండు చేతులకూ తీవ్రంగా గాయాలయ్యాయి. ఎముకలు విరిగిపోయాయి.
