ADS

header ads

సిఎంను విమర్శిస్తూ ఫేస్‌బుక్‌లో పోస్ట్‌... అరెస్ట్ చేసిన పోలీసులు...

NEWS HUNTER : రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డిని దూషిస్తూ ఫేస్‌బుక్‌లో పోస్టింగ్‌ చేస్తున్న విద్యార్థిని గుంటూరు లాలాపేట పోలీసులు శుక్రవారం సాయంత్రం అదుపులోకి తీసుకున్నారు. లాలాపేట పోలీసు స్టేషన్‌ పరిధిలోని ఎల్‌ఆర్‌ నగర్‌కు చెందిన ప్రవీణ్‌గౌడ్‌ ఇంజినీరింగ్‌ చదువుతున్నాడు. సిఎంను విమర్శిస్తూ ఫేస్‌బుక్‌లో పెట్టిన పోస్ట్‌లపై లాలాపేట ప్రాంతానికే చెందిన కరీం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సిఐ ఫిరోజ్‌ ఆదేశాల మేరకు ప్రవీణ్‌గౌడ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.