ADS

header ads

టిక్ టాక్ మరొకరి ప్రాణం తీసింది.

NEWS HUNTER : టిక్ టాక్ మరొకరి ప్రాణం తీసింది. ఇద్దరు అన్నదమ్ములు సరదా కోసం చేసిన ప్రయత్నం వారి కుటుంబంలో విషాదం నింపింది . ఈ ఘటన హైదరాబాద్‌ నగర శివార్లలోని ఓ చెరువులో జరిగింది. సంగారెడ్డి జిల్లాకి చెందిన యువకుడు నర్సింహులు, అతనికి వరుసకు సోదరుడైన ప్రశాంత్‌.. ఇద్దరూ కలిసి దూలపల్లి దుమార్‌ చెరువులో దిగారు. ఫోన్ టిక్ టాక్ యాప్‌ను అనుసరిస్తూ నర్సింహులు చెరువులోకి దిగాడు. చెరువుగట్టుపై నుంచి ప్రశాంత్ వీడియో చిత్రీకరిస్తూ ఉండగా… ఈత రాక నర్సింహులు నీటిలో మునిగి గల్లంతయ్యాడు. దీంతో భయపడిన ప్రశాంత్‌.. స్థానికులకు సమాచారమిచ్చాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, స్థానికులు యువకుడి మృతదేహాన్ని బయటికి తీశారు.కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.