News Hunter : నెల్లూరురూరల్ నియోజకవర్గం 39వ డివిజన్ ఫతేఖాన్ పేట లో స్థానిక టి.డి.పి నాయకులు బాపనపల్లి శశిధర్ ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రూరల్ నియోజకవర్గ ఇంచార్జీ అబ్దుల్ అజీజ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ డివిజన్లో కార్యకర్తలకి అండగా ఉంటామని అలాగే డివిజన్లో పార్టీ బలపరిచే విధంగా అందరూ సమన్వయంతో కలిసి పని చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు సుమంత్, కొండారెడ్డి , ఉదయభాస్కర్ , ప్రభాకర్, క్రిస్టోఫర్, కరుణాకర్, మునిర్, సుబ్బయ్య, రఫీ, సుధాకర్ రాజు, సీబీన్ ఆర్మీ నెల్లూరు రూరల్ ప్రెసిడెంట్ వాసిరెడ్డి చంద్రనాగ్.. మహిళా నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
