News Hunter : అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఎబివిపి గూడూరు శాఖ ఆధ్వర్యంలో స్థానిక కేశవ నిలయం లో పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా జిల్లా కన్వీనర్ కార్తీక్ మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు అధికారులు పట్టించుకోకపోతే ఏబీవీపీ ఆధ్వర్యంలో తరగతులను అడ్డుకుంటామని ఆయన హెచ్చరించారు మరియు ఈ సందర్భంగా స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్ మనోజ్ కుమార్ మాట్లాడుతూ సెలవులలో పండగలలో విద్యార్థులు మానసిక వత్తిడికి గురి చేస్తున్నారని కనీస విద్యార్థులకు మనో వికాసాన్ని ఆనందాన్ని కలిగించాలని సాంప్రదాయబద్ధమైన మన సంస్కృతికి సంబంధించిన పండగలకు సెలవులు ఇవ్వకుండా తరగతులకు నిర్వహించే వారిపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు లేనిపక్షంలో ఉద్యమం తప్పదని వారు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో లో కాస్ట్ కార్యవర్గ సభ్యులు చిన్న నగర కార్యదర్శి శ్యామ్ జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ జార్జ్ నగర సహాయ కార్యదర్శి హర్ష తదితరులు పాల్గొన్నారు
