ADS

header ads

అమితాబ్‌కు 'దాదా సాహెబ్ ఫాల్కే'


News Hunter : బిగ్ బీ, బాలీవుడ్ లెజెండ్ అమితాబ్‌ బచ్చన్‌ను ప్రతిష్టాత్మక పురస్కారం వరించింది. అమితాబ్‌కు 'దాదా సాహెబ్ ఫాల్కే' అవార్డును ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. బాలీవుడ్ ఐకాన్ అమితాబ్ బచ్చన్‌... దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకు ఎంపికైనట్లు కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ సోషల్ మీడియాలో ప్రకటించారు. సినీరంగంలో చేసిన విశేష సేవలకు గాను ఈ అవార్డుకు ఆయనను ఎంపిక చేసినట్టు పేర్కొన్నారు. ట్విట్టర్‌లో బిగ్‌ బీ సేవలను కొనియాడిన జవదేకర్.. ఏకగ్రీవంగా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకు ఎంపికైనందుకు అభినందనలు తెలిపారు. ఇక, రెండు తరాల ప్రేక్షకులను సమ్మోహితులను చేసి, వారికి స్ఫూర్తిగా నిలిచారని, ఆయనను చూసి యావత్ దేశంతో పాటు అంతర్జాతీయ సమాజం కూడా గర్విస్తోందని ప్రశంసించారు జవదేవకర్.