విద్యుత్ కంపెనీలకు ఏపీ హై కోర్టు షాక్ ఇచ్చింది. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను పున సమీక్షకు అవకాశమే లేదన్న విద్యుత్ కంపెనీల వాదనలను న్యాయస్థానం తోసిపుచ్చింది. పీపీఏల పున సమీక్ష కోసం ఏపీఈఆర్ సీకి వెళ్తామంటూ ప్రభుత్వం చేసిన వాదనను కోర్టు సమర్థించింది. మధ్యంతర చెల్లింపు కింద యూనిట్ కు రెండు రూపాయల 43 పైసల నుంచి రెండు రూపాయల 44 పైసల చెల్లిస్తామన్న ప్రభుత్వ వాదనను హైకోర్టు అంగీకరించింది.
