ADS

header ads

బుచ్చి ఎస్సై, ఏఎస్సైపై కేసు నమోదు – విధుల నుంచి తప్పించిన ఎస్పీ


News Hunter : ( Buchi ) – ఓ కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తిని కొట్టారన్న కారణంతో నెల్లూరుజిల్లాలోని బుచ్చిరెడ్డిపాళెం పోలీసులపై కేసు నమోదైంది. వివరాల్లో కెళ్తే… రెండు రోజుల క్రితం కోళ్లు మరియు జీవ వ్యార్ధాలను తరలిస్తున్న 15 మందిని బుచ్చిరెడ్డి పాళెం పోలీసులు అరెస్ట్ చేశారు. వ్యర్ధాలు తరలిస్తున్న ఓ వ్యక్తి వాహనం ఆపకుండా వెళ్లడంతో ఆ వాహనాన్ని పోలీసులు వెంబడించి మరీ పట్టుకున్నారు. శెట్టి ప్రభాకర్ అనే ఆ వ్యక్తిని స్టేషన్ లో ఎస్సై కొట్టాడని అభియోగం. వీపుపై, కాలి పై వాతలు పడటంతో ఆ వ్యక్తి నెల్లూరులోని ప్రభుత్వ వైద్యశాలలో చేరాడు. దీంతో ఆసుపత్రిలోని అవుట్ పోస్టు పోలీసులు దీనిపై నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్ కు సమాచారమందించారు. మరో వైపు శెట్టి ప్రభాకర్ కూడా నెల్లూరు రూరల్ డిఎస్పీ రాఘవరెడ్డికి ఫిర్యాదు చేశారు. విషయం ఎస్పీ ఐశ్వర్య రస్తోగి వద్దకు వెళ్లడంతో వెంటనే వారిపై కేసు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో బుచ్చిరెడ్డిపాళెం ఎస్సై బలరామిరెడ్డి, ఏఎస్సై మస్తాన్, కానిస్టేబుల్ అనీల్ పై కేసు నమోదు చేశారు. వెంటనే ఎస్పీ వారిని విధుల నుండి తప్పించి, విఆర్ కు బదిలీ చేశారు.