ADS

header ads

పల్లిపాలెంలో ఘనంగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి జన్మదిన వేడుకలు


News Hunter :-
* పల్లిపాలెంలో ఘనంగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి జన్మదిన వేడుకలు*

*పల్లిపాళెం గ్రామంలో టీడీపీ సీనియర్ నాయకులు వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీలో  చేరారు.*


నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని మాదరాజు గూడూరు పల్లిపాలెంలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. పై కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇంఛార్జి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి పాల్గొని దైవ సన్నిధిలో ప్రత్యేక పూజలు మరియు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేసారు.

కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి  పుట్టినరోజు సందర్భంగా పల్లిపాళెం గ్రామంలో టీడీపీ సీనియర్ నాయకులు పూనమల్లి రామకృష్ణ, నేట్రం బాక వెంకటేశ్వర్లు, నేట్రం బాక రవి, తాండ్ర రమణయ్య,  పూనమల్లి హరి కృష్ణ, దండు వెంకట రమణయ్య తదితరులు వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీలో  చేరారు.  వీరికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇంఛార్జి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.

పల్లెపాలెం గ్రామంలో టీడీపీ ఖాళీ కావటంతో వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆనందం వ్యక్తం  చేసారు.

పై కార్యక్రమంలో మాజీ సర్పంచ్ చిట్టిబోయిన వెంకటేశ్వర్లు, బైనబోయిన సుధాకర్ యాదవ్, మండల కన్వీనర్ పుచ్చలపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి, పెనుబర్తి మాజీ సర్పంచ్ వెంకటేశ్వర్లు రెడ్డి, రవీంద్ర రెడ్డి, శేఖర్ రెడ్డి, ఉమా మహేశ్వర్ రెడ్డి, వీర రాఘవ రెడ్డి, నేట్రం బాక రాజేంద్ర ప్రసాద్, దండు మస్తానయ్య, కుప్పా సురేంద్ర, తాండ్ర వెంకట రమణయ్య తదితరులు పాల్గొన్నారు.