ADS

header ads

కృష్ణపట్నం పోర్టు బస్సు ఢీ కొని తాళ్లపూడి వాసి మృతి

News Hunter : ముత్తుకూరు మండలం బ్రహ్మదేవి సమీపంలో నెల్లూరు – ముత్తుకూరు రోడ్డు వద్ద తాళ్లపూడి కి బుధవారం రాత్రి మోటార్ బైక్ పై వెలుతున్న మన్నేపల్లి శీనయ్య (49)ను కృష్ణపట్నం పోర్టు కు చెందిన బస్సు అతివేగంగా నెల్లూరు వైపు వెళుతూ ఢీ కొట్టింది.  కొన ఊపిరితో వున్న శీనయ్య ను హుటాహుటిన 108 వాహనం లో నారాయణ హాస్పిటల్ కి తరలించారు అక్కడే చనిపోయినట్లు తెలిసింది. మృతుడు శీనయ్య కు భార్య,5 మంది పిల్లలు ఉన్నారు. ముత్తుకూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.పోర్టు కంపెనీ కి చెందిన బస్సు ను పోలీసు స్టేషన్ కు తరలించారు.