ADS

header ads

కనుపూరు సాగునీరు కాలువలను పరిశీలించిన ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి.


News Hunter : నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలో కనుపూరు కాలువ ద్వారా సాగునీరు అందిస్తున్న సాగునీటి కాలువను  వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసన సభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి పరిశీలించారు. 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వరుణదేవునికరుణతో వర్షాలు సకాలంలో రావడం, వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి  పాలనకు  శుభారంభమని ప్రతి సెంటు పొలానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా సాగునీరు అందిస్తామని గత ప్రభుత్వం సాగునీటి పంపిణీలో కూడా రాజకీయాలు చేసి రైతులను ఇబ్బందులకు గురిచేశారని, నీరు-చెట్టు పేరిట రైతుల కాలువల్లో నీరు పారలేదు కానీ తెలుగు తమ్ముళ్లు తమ ఇళ్లల్లో నిధులు పారయన్నరు.

గత ప్రభుత్వం రాజకీయ కుట్రతో అనర్హులను సాగునీటి వినియోగ సంఘాలకు అధ్యక్షులుగా నియమించి అవినీతికి తెర తీసిందన్నారు, సాగునీటి అవసరాల పేరిట పనులు మంజూరు చేయించుకుని, పనులు చేయకుండానే బిల్లులు చేయించుకున్నరన్నారు. రైతుల పేరిట దోపిడీకి పాల్పడిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం మని, తము రైతులకు నిరంతరం అందుబాటులో ఉంటు నిత్యం సాగునీటి పంపిణీ పర్యవేక్షిస్తూ సాఫీగా సాగునీరు అందిస్తామన్నారు.