ADS

header ads

మనుబోలు మండలం ముద్దమూడి, చెరుకుమూడి గ్రామాలలో పర్యటించిన ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి.


News Hunter : నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం మనుబోలు మండలంలో ముద్దుమూడి, చెరుకుమూడి గ్రామాలలో వైకాపా  జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసన సభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి పర్యటించారు.

ప్రజలనుండి సమస్యలపై అర్జీలు స్వీకరించారు. మహిళలు హారతులతో స్వాగతం  పలికారు, గజమాలలతో  వైయస్సార్సీపీ శ్రేణులు  ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డిని సన్మానించారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందే విధంగా కృషి చేస్తానని ఎమ్మెల్యే కాకాణి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మేము వేసిన రోడ్లపై తిరుగుతూ, లైట్ల కింద ఉంటున్నారు అన్న వ్యక్తికి ప్రజలు బుద్ది చెప్పారు. గతంలో మంత్రిగా ఉన్న వ్యక్తి దోచుకోవడంలో తప్ప, గ్రామాలలో ఏ ఒక్క అభివృద్ధి చేయలేదు. ఎల్. ఈ. డి. లైట్లు ఎక్కడా లేని విధంగా ఉంటాయని చెప్పిన ఆ వ్యక్తీ కాంట్రాక్టర్లు ఇప్పుడు కనిపించడం లేదు.గతంలో దోపిడీలు తప్ప  ప్రజలకు అవసరమైన వాటిని మాత్రం చేయలేదు. గతంలో జరిగిన దోపిడీపై రివర్స్ టెండరింగ్ ద్వారా ప్రభుత్వానికి 800 కోట్లు ఆదాయం వచ్చింది. ప్రధానంగా గతంలో ఓడిన వ్యక్తులు మంత్రులు అయ్యారు. మంత్రిగా పనిచేసిన వ్యక్తి ధన దాహం వల్ల, బండేపల్లి కాలువ పనులు ఆగాయి.గతంలో ఈ ప్రాంతానికి ఎంతో మంది ఎమ్మెల్యే లుగా పనిచేశారు, కానీ అవినీతి మాత్రం సోమిరెడ్డి హయాంలో జరిగింది. శవాల మీద కాకులు వాలినట్లు ఎక్కడ ఏమి జరిగినా ప్రతిపక్ష పార్టీ, వైయస్సార్సీపీ పై బురద చల్లుతున్నారు.గోవర్ధన్ రెడ్డి మీదే గెలవాలి అన్న వ్యక్తికి దేవుడు సరైన తీర్పు ఇచ్చాడు. 42 సంవత్సరాలగా నా తండ్రి వేసిన పునాదిపై నేను ఇంత వరకు ఎక్కడా వెనకడుగు వేయలేదు. బండేపల్లి కాలువకు ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి  నిధులు కేటాయించారు.మీకు ఏ సమస్య వచ్చినా అడిగే హక్కు మీకు ఉంది, చేసే బాధ్యత నాపై ఉంది. పార్టీ కోసం పనిచేసిన ప్రతి ఒక్కరిని నా భుజాలపై మోస్తానన్నారు.