News Hunter : నెల్లూరు రూరల్ నియోజకవర్గం లోని 37 వ డివిజన్ లో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయ ఇంచార్జ్ కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి పర్యటించారు. దోమల నివారణ కార్యక్రమంలో డ్రైనేజీ కాలవలో ఆయిల్ బాల్స్ ని కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి ఏర్పాటు చేసారు.ఈ సందర్భంగా కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి మాట్లాడుతూ వర్షాకాలం మొదలవడంతో దోమల వలన ప్రజలకు ఎటువంటి అనారోగ్య పరిస్థితులు రాకుండా తగు చర్యలు తీసుకోవాలని అధికారులు సూచించారు.
