ADS

header ads

కొవ్వూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాం- ఎంపీ ఆదాల


News Hunter : నెల్లూరు లోక్ సభ పరిధిలో అత్యధిక మెజారిటీ ఇచ్చిన ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి తెలిపారు. కోవూరు నియోజకవర్గం లోని పోతిరెడ్డి పాలెం లో గురువారం స్థానిక ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో విజయోత్సవ ర్యాలీ జరిగింది. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ  స్థానిక ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డితో కలిసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. ఈ నియోజక వర్గం ఎంతో చైతన్యవంతమైనదని, వైసిపి కి అండగా నిలిచి అత్యధిక మెజార్టీ ఇచ్చిందని పేర్కొన్నారు.  ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు అమలు లో పూర్తిగా నిమగ్నం అయ్యారని తెలిపారు. చంద్రబాబు తాను ఎందుకు ఓటమి పాలయ్యా నో అర్థం కావడం లేదని చెప్పడం విడ్డూరంగా ఉందని తెలిపారు. చెప్పిన హామీ లను అమలు చేయని చంద్రబాబు కు 23 సీట్లు దక్కాయని ఇప్పటికైనా ఆయన వాస్తవాన్ని గుర్తించడం లేదని పేర్కొన్నారు. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రాన్ని చక్కదిద్దేందుకు జగన్ కృషి చేస్తున్నారని మొదట సంక్షేమ పథకాలను అమలు చేసి తర్వాత అభివృద్ధి పనులపై దృష్టి సారిస్తారని పేర్కొన్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా లక్షల ఉద్యోగాలను నిరుద్యోగులకు కల్పించారని తెలిపారు. జగన్ అధికారంలోకి వచ్చాక వర్షాలు సమృద్ధిగా కురిసి జలాశయాలు నిండా యని గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో లాగానే ఇప్పుడు సాగుకు అవకాశం ఏర్పడిందని తెలిపారు. టిడిపి నుంచి  వైసీపీకి వలసలు సాగుతున్నాయని, వచ్చే ఐదేళ్లలో ఆ పార్టీలో మిగిలే నాయకులు ఎవరూ కనిపించడం లేదని పేర్కొన్నారు .

ఆర్భాటంగా సాగిన విజయోత్సవ ర్యాలీ

 పోతిరెడ్డి పాలెం లో గురువారం జరిగిన విజయోత్సవ ర్యాలీ ఆర్భాటంగా సాగింది కీలు గుర్రాలు బాణసంచా తప్పెట్లు తాళాలతో ర్యాలీ మొదలైంది స్థానికులు కార్యకర్తలు నేతలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి నియోజకవర్గ పరిస్థితులపై ప్రసంగించారు. స్వర్ణ వెంకయ్య , అవినాష్, పాముల హరి , నరసింహారావు, రజనీ ఇందిరా తదితరులు పాల్గొన్నారు వనం మనం ఫౌండేషన్ ఆధ్వర్యంలో సానిక ప్రాథమికోన్నత పాఠశాలలో ఎమ్మెల్యే తో కలిసి మొక్కలు నాటారు .