ADS

header ads

విక్రమ్ ల్యాండర్ ఆచూకీలో తొలి అడుగు.. ఫొటోలు విడుదల చేసిన నాసా


News Hunterభారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన ‘చంద్రయాన్‌ 2’లోని విక్రమ్ ల్యాండింగ్ కోసం ముందుగా నిర్ధేశించిన ప్రాంత ఫొటోలను నాసాకు చెందిన ఎల్ఆర్వో(లూనార్ రెకొనైసెన్స్ ఆర్బిటర్) తీసింది. సెప్టెంబర్ 17న  ఈ ఫొటోలను తీయగా.. వాటిని తాజాగా విడుదల చేసింది. రాత్రి సమయంలో తీయడం వలన విక్రమ్ ల్యాండర్ ఎక్కడ లొకేట్ అయ్యిందో గుర్తించలేకపోతున్నామని నాసా ప్రకటించింది. అయితే అక్టోబర్‌లో పగలు సమయం వస్తుందని.. అప్పుడు విక్రమ్‌కు చెందిన పలు ఫొటోలను తీస్తామని ఆ సంస్థ తెలిపింది. ‘‘విక్రమ్ ల్యాండర్‌ హార్డ్‌గా ల్యాండ్ అయింది. చంద్రుడి ఉపరితలంపై విక్రమ్ ఎక్కడ ల్యాండ్ అయ్యింది అనే విషయాన్ని ఇంకా నిర్ధారించాల్సి ఉంది’’ అని నాసా వెల్లడించింది.