NEWS HUNTER : నెల్లూరు నారాయణ హాస్పిటల్ లో ఈనెల 23వ తేదీ నుండి నెల రోజుల పాటు మోకాలి చిప్పల ప్రత్యేక క్లినిక్ ఏర్పాటు చేస్తున్నట్లు నారాయణ వైద్యశాల యాజమాన్యం తెలిపింది.60 సంవత్సరాలు పైబడిన వారికి మాత్రమే వచ్చే మోకాళ్ళ నొప్పులు ఇప్పుడు జీవన విధానాల మార్పు, సరైన వ్యాయామం లేకపోవడం, అధిక బరువు కారణాల వలన 40 సంవత్సరాల వారికి కూడా ఈ నొప్పులతో బాధ పడుతున్నారని ఎక్కువగా 40 నుండి 45 సంవత్సరాల లోపు వారికే ఈ ఈ నొప్పులు ఎక్కువ అవడంతో మొగుళ్ల మార్పు చేయించుకుంటున్నారని వైద్యులు తెలిపారు. అయితే ఈ ప్రమాదం నుండి బయటపడాలనే ప్రధాన ఉద్దేశంతో ఈ ప్రత్యేక క్లినిక్ను ప్రారంభించడం జరుగుతుందని నారాయణ వైద్యశాల వైద్యులు తెలిపారు. ఈ ప్యాకేజీ కోసం నారాయణ జనరల్ హాస్పిటల్ ఓపి విభాగంలోని రెండవ అంతస్తు నందు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు వైద్య నిపుణులు అందుబాటులో ఉంటారని యాజమాన్యం తెలిపింది. ఇతర వివరాల కొరకు 7331170063 గల ఫోన్ నెంబర్ను సంప్రదించవచ్చని నారాయణ వైద్యశాల యాజమాన్యం తెలిపింది.
