ADS

header ads

అంతర్రాష్ట్ర దొంగలను అరెస్ట్ చేసిన నెల్లూరు జిల్లా పోలీసులు


News Hunter (Nellore) :  ఏటిఎమ్ కేంద్రాల్లో మాటువేసి వేసి వృద్దులు మరియు ఏటిఎమ్ కార్డులు ఉపయోగించడం తెలియని వారిని టార్గెట్ గా చేసి స్కిమ్మింగ్ యంత్రం ద్వారా వాటి ఏటిఎమ్ కార్డులను క్లోనింగ్ చేసి వారి ఖాతాల్లోని నగదును మాయం చేసే హర్యానా గ్యాంగ్ ను నెల్లూరుజిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు.
హర్యానా రాష్ట్రంలోని భవానీ జిల్లాకు చెందిన సందీప్ కుమార్, మంజీత్, జగ్జీత్ అనే ముగ్గురు నేరస్తులు ఈ తరహా నేరాలకు పాల్పడ్డారు. నెల్లూరుజిల్లాలో ఈ తరహా 16 నేరాలకు పాల్పడి వారి ఖాతాల్లోని నగదును దోచేశారు. దీనిపై ఫిర్యాదు రావడంతో జిల్లా ఎస్పీ ఐశ్వర్య రస్తోగి స్పెషల్ టీం ఏర్పాటు చేసి దర్యాప్తు చేయించారు. హర్యానా గ్యాంగ్ పై అనుమానం వచ్చి వారిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు నిజాలు బయటపడ్డాయి. వారు నివాసం ఉండే ప్రాంతాలను తనిఖీ చేయగా స్కిమ్మింగ్ యంత్రం, డూప్లికేట్ ఏటిఎమ్ కార్డులు, డివైజ్, మొబైల్ ఫోన్లు, లాప్ ట్యాప్, ఓ కారు, 7లక్షలా 4వేల నగదును గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం ముగ్గురు నేరస్తులను అరెస్ట్ చేసి జైలుకు పంపారు. జిల్లా ఎస్పీ ఐశ్వర్య రస్తోగి నెల్లూరులోని ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించారు. మన రాష్ట్రంలో వీరు నెల్లూరుతో పాటూ శ్రీకాకుళం, విశాఖపట్నం, అనంతపురం, గుంటూరు, కర్నూలు, ప్రకాశం, వనపర్తి, తెలంగాణాలోని హైదరాబాద్ లో కూడా ఇదే తరహా నేరాలకు పాల్పడి ఉన్నారని చెప్పారు. ముద్దాయిలను అరెస్ట్ చేయడంలో ప్రతిభ చూపిన దర్గామిట్ట పోలీసులతో పాటూ నగర డిఎస్పీ శ్రీనివాసులురెడ్డి, పలు స్టేషన్ల సిఐలకు ఎస్పీ అభినందించారు.