News Hunter : నెల్లూరు అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ ఆఫీసులో వ్యవసాయ అధికారులతో నెల్లూరు రూరల్ ఎం.ఎల్.ఎ. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. నెల్లూరు రూరల్ రైతు అధ్యయన కమిటీ చైర్మన్ గా చెవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రూరల్ ఎమ్.ఎల్.ఎ. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఆనం విజయ్ కుమార్ రెడ్డి మరియు రూరల్ కార్యాలయం ఇన్ ఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి నియమించారు.
ఈ సందర్భంగా రూరల్ ఎమ్.ఎల్.ఎ. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ రైతులపట్ల అవగాహన ఉన్న వ్యక్తి చెవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరు రూరల్ రైతు అధ్యయన కమిటీ చైర్మన్ గా నియమించడం జరిగిందని అన్నారు. వచ్చే రెండున్నర సంవత్సరాల లో రైతులకు నీటి కొరత లేదన్నారు. రాష్ట్రంలో నెల్లూరు రూరల్ ను ఒక ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతా నను అన్నారు. అధికారులందరూ సమిష్టి కృషితో సమన్వయంతో పనిచేసి, రైతులకు మద్దతు ధర కల్పించి, రైతు ఆత్మహత్యలు లేని రాష్ట్రంగా చేయుటకు కృషి చేయవలసినదిగా అధికారులను కోరారు.
ఆనం విజయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, రైతులపట్ల పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి చెవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరు రూరల్ రైతు అధ్యయన కమిటీ చైర్మన్ గా నియమించడం చాలా సంతోషదాయకమని అన్నారు.
