ADS

header ads

నారాయణలో పి.సి.బి. డిజైన్ అండ్ ఫాబ్రికేషన్ పై సర్టిఫికేట్ కోర్స్

News Hunter :  గూడూరుపట్టణం లోని నారాయణ ఇంజినీరింగ్ కళాశాలలో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ విభాగంలో ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్ధులకు  టేక్ ఆఫ్ ఎడ్యు గ్రూప్, తిరుపతి వారిచే “పిసిబి డిజైన్ అండ్ ఫాబ్రికేషన్” పై ఐదు రోజుల సర్టిఫికేట్ కోర్స్  జరిగినట్లు కళాశాల మేనేజింగ్ సెక్రటరీ వై. వినయ్ కుమార్  తెలిపారు.

ఈ ఐదు రోజుల కార్యక్రమములో మొదటి రోజు రాకేష్ రాజన్ బృందం ఎలక్ట్రానిక్స్ లో ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్స్ యొక్క ప్రాముఖ్యత, ఆవశ్యకతను మరియు వివిధరకాల ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్స్ తయారుచేయు విధానం గురించి విద్యార్థులకు వివరించారు.
తదుపరి రెండు రోజులు పి.సి.బి  తయారుచేయాడానికి కావలసిన హార్డువేర్ మరియు సాఫ్ట్వేర్ పరికరాల గురించి వివరించారు. పి.సి.బి. డిజైన్ లో వున్నవివిధ దశలను అనగా డిజైన్ ను సాఫ్ట్వేర్ లో సిములేట్ చేయడం,  దానిని హార్డువేర్ లో ఫ్యాబ్రికేట్ చేయు విధానాన్ని మరియు పి .సి బి మీద వివిధ సర్క్యూట్ లను డిజైన్ చేయడం వివరించారు. చివరి రెండు రోజులు వివిధ పరికరాలను పి .సి బి మీద సోల్దేరింగ్ చేయడం, పి .సి బి అసెంబ్లింగ్ మరియు టెస్టింగ్ చేయు విధానాన్ని వివరించారు. 
ఈ సందర్బంగా ఇ.ఇ.ఇ. విభాగాధిపతి డా. జె.ఏ. భాస్కర్  మాట్లాడుతూ ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డు(పిసిబి) ని ప్రతి చిన్న ఎలక్ట్రానిక్ పరికరాల నుంచి పెద్ద పరికరాల తయారీలో ఉపయోగిస్తారని. హార్డువేర్ పరికరాలను అమర్చడానికి మరియు వాటికి ఎలక్ట్రికల్ కనెక్షన్స్ ఇవ్వడానికి ఉపయోగిస్తారని తెలిపారు. వివిధ రకాల సింగిల్, డబుల్ సైడేడ్, మల్టీ లేయర్ పిసిబి తయారు చేయు విధానాన్ని వివరించారు. విద్యార్ధులు ఈ కార్యక్రమంలో ఆసక్తిగా పాల్గొని రకరకాల సర్క్యూట్ లను డిజైన్ చేయు విధానాలను నేర్చుకోవాలని, ఇది విద్యార్ధులకు భవిష్యతులో ప్రాజెక్టుల రూపకల్పనలో ఉపయోగపడుతుందని తెలిపారు.
ఈ సందర్భం గా కళాశాల ప్రిన్సిపాల్ డా. సి.హెచ్. పరమేశ్వర రావు  మాట్లాడుతూ ఇటువంటి అవగాహనా సదస్సులు విద్యార్ధులు తమ ఆచరణాత్మక జ్ఞానాని పెంపొందించుకోవడానికి ఎంతగానో ఉపయోగ పడతాయని తెలిపారు.  ఈ సందర్భం గా కళాశాలకు విచ్చేసిన శ్రీ రాకేష్ రాజన్  మరియు వారి బృందానికి ప్రిన్సిపాల్ కృతజ్ఞతలు తెలిపారు
ఈ కార్యక్రమంలో ఇ.ఇ.ఇ. ద్వితీయ సoవత్సరం చదువుతున్న 42 మంది విద్యార్ధిని విద్యార్ధులు మరియు ఇ.ఇ.ఇ. అధ్యాపకులు  ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు.