ADS

header ads

బోటు వెలికితీతకు రెండు సార్లు ప్రయత్నించి విఫలమైన సత్యం టీం..


News Hunter : తూర్పు గోదావరి జిల్లా కచ్చులూరు వద్ద గోదావరిలో మునిగిన బోటును వెలికితీసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది ధర్మాడీ సత్యం టీం. సోమవారం రెండు సార్లు ప్రయత్నించి విఫలమైంది. సాయంత్రం కావడంతో… వెలికితీత పనుల్ని నిలిపివేశారు. ఈ ఉదయం రోప్‌లకు యాంకర్లు తగిలించి నీటిలో జారవిడిచారు. బోటు మునిగిన ప్రాంతంలో మొత్తం ఐదు యాంకర్లు వేసినట్లు తెలుస్తోంది. బోటు మునిగిన ప్రాంతం చుట్టూ తిరుగుతూ యాంకర్లను నీటిలో వేయడంతో బలమైన వస్తువు తగిలినట్లుగా తెలుస్తోంది. అది మునిగిపోయిన రాయల్ వశిష్ట బోటు అయి ఉండొచ్చని భావిస్తున్నారు.. నీటి అడుగున ఉన్న వస్తువులను బయటకు తీసే ప్రక్రియకు చాలా సమయం పడుతుంది. అయితే ఆ వస్తువు బోటా? కాదా? అన్నది తెలియడం లేదు. మరోవైపు సాయంత్రం కావడంతో.. బోటు వెలికితీత పనులకు విరామం ప్రకటించారు. మంగళవారం ఉదయం తిరిగి వెలికితీత పనులు ప్రారంభించనుంది ధర్మాడీ సత్యం బృందం.