ADS

header ads

శ్రీపతి పండితారాధ్యుల సాంబమూర్తి నూతన విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం!

News Hunter : ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తండ్రి శ్రీపతి పండితారాధ్యుల సాంబమూర్తి నూతన విగ్రహాన్ని కస్తూర్బా కళాక్షేత్రంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తండ్రి కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. శిల్పి రాజకుమార్ వడయార్ కు ఆయన ఆత్మీయ సన్మానం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ గతంలో ఇక్కడ ఉన్న విగ్రహాన్ని తన ఇంటి ఆవరణలో ప్రతిష్టించబోతున్నట్టు తెలిపారు . నెల్లూరులో తన తల్లిదండ్రులు నివశించిన ఇంటిని వేదపాఠశాలకోసం ఇస్తున్నట్టు బాలసుబ్రహ్మణ్యం ప్రకటించారు.