News Hunter (నెల్లూరు) : మెగాస్టార్ చిరంజీవి నటించిన సైతం నరసింహ రెడ్డి చిత్రం విజయవంతం కావాలని కోరుతూ చిరంజీవి యువత ఆధ్వర్యంలో బుధవారం వి.ఆర్.సి సెంటర్ లోని వరసిద్ధి వినాయక ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా చిరంజీవి యువత నాయకులు మాట్లాడుతూ మరుగై ఉన్న మొట్టమొదటి స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి జీవితాన్ని ప్రపంచానికి తెలియచేస్తూ రాంచరణ్ నిర్మించిన సైరా చిత్రం విజయవంతం అవ్వాలని 101 టెంకాయలు కొట్టడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో యువత నాయకులు కె. క్రిష్ణా రెడ్డి, కొట్టే వెంకటేశ్వర్లు, పీ. చంద్ర శేఖర్ రెడ్డి, అస్లాం, శేషయ్య, వంశీ, సురేష్, ప్రసాద్, రవి, గణేష్, చిన్నా, రాము, ప్రవీణ్, శ్యాం, విష్ణు తదితరులు పాల్గొన్నారు.
